Jamili Elections | జమిలి ఎన్నికలు అసాధ్యం
ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే వెల్లడి
హాట్ టాపిక్‌గా మారిన జమిలి
వచ్చే పార్లమెంట్ సమావేశాల తర్వాతే పూర్తి స్పష్టత
రాజకీయ పార్టీలలో వ్యక్తమవుతున్న భిన్నాభిప్రాయాలు
Hyderabad : దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు నిర్వహించే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. సాధ్యాసాధ్యాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎవరి వాదన వారు వినిపించే పరిస్థితులు వచ్చాయి. ఇదిలా ఉంటే దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ఒక పక్క బీజేపీ సర్కారు నిర్ణయం తీసుకుని, అందుకు సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశంలో ప్రవేశ పెడుతామని చెబుతుంది. అందుకోసం కేంద్ర క్యాబినేట్ కూడా ఆమోదించినట్లు కూడా చెప్పుతోంది. అయితే ఇందుకు భిన్నంగా ప్రతిపక్షాలు కూడా స్పందించాయి. ఈ మేరకు దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు (జమిలి) ఎన్నికలు నిర్వహించడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని, ప్రస్తుతం పరిస్థితుల్లో అనేక అవాంతరాలు ఎదురవుతాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కుండబద్ధలు కొట్టారు. ఈ మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడురు. అయితే దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఏకాభిప్రాయం అనేది చాలా అవసరమని పేర్కొన్నారు. పైగా మెజారిటీ కూడా కావాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ విషయంలో ఎన్‌డీఏ సర్కారు దుందుడుకు నిర్ణయాలు సరికాదని ఆయన తెలిపారు. అయినా ప్రధాని నరేంద్రమోడి చెప్పింది ఎప్పుడూ చేసిన దాఖలాలు లేవని మల్లి ఖార్జున ఖర్టే ఎద్దేవ చేశారు.
దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు (జమిలి) ఎన్నికలు నిర్వహించే అంశంపై సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేత్రుత్వంలో కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు అన్ని పార్టీల ప్రధాన నాయకులతో ఆయన సమావేశమై పలువురి అభిప్రాయాలు సేకరించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన నివేదికను రామ్‌నాథ్‌కోవింద్ భారత రాష్ట్రపతికి నివేదిక రూపంలో అందచేశారు. ఆ నివేదిక అనంతరం ప్రధాని నరేంద్రమోడి ఆధ్వర్యంలో జమిలి ఎన్నికల నిర్వహించాలని తీసుకున్న నిర్ణయానికి బలం చేకూర్చుతున్నట్లు అర్థమవుతుంది. అయితే ప్రతిపక్ష పార్టీలు మాత్రం జమిలి ఎన్నికలను బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. అయితే జమిలి ఎన్నికలపై పూర్తి స్పష్టత రావాలంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల వరకు వేచిచూడాల్సి ఉంటుంది.
దేశం మరింతగా అభివ్రుద్ధి చెందాలంటే జమిలి ఎన్నికలు నిర్వహించాల్సిందే అని కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ సర్కారు అభిప్రాయపడుతుంది. దాని వల్ల ఎన్నికల వ్యయం బాగా తగ్గడంతో పాటు మిగిలిన నిధులను ప్రభుత్వ పథకాలకు కేటాయించవచ్చే కదా అని కేంద్రం అభిప్రాయపడుతుంది. జమిలి వస్తే ప్రకారం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే ఇందులో అనేక చిక్కు ముడులు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెప్పుతున్నారు అలాగే దేశ వ్యాప్తంగా లోకల్ బాడీ ఎన్నికలు ఒకే దఫాలో నిర్వహించాల్సి ఉంటుంది. కాని ఇలాంటి ఎన్నికల విధానంతో స్థానిక అంశాలు, రాజకీయ అంశాలు, సామాజిక, ఆర్థిక అంశాలతో పాటు ప్రక్రుతి పరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితులు ఎంతైనా ఉందని, ప్రాంతాల వారీగా రాజకీయ సమీకరణాలు మారే పరిస్థితులు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి మాత్రం జమిలి ఎన్నికల విధానంపై మాత్రం రాజకీయ పార్టీలలో భిన్నాభిప్రాయాలే అధికంగా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో జమిలి ఎన్నికల బిల్లుకు ఆమోదం లభిస్తుందా అనే అంశంపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం జమిలి ఎన్నికల నిర్వహణ దేశ వ్యాప్తంగా పెద్ద చర్చానీయాంశంగా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
* * *
Leave A Comment